YS Sharmila: ఢిల్లీలో సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిసిన షర్మిల

Sharmila Tweets After Key Meeting with Gandhi Family

  • నేడు ఢిల్లీలో షర్మిల పర్యటన
  • గాంధీల కుటుంబంతో భేటీ
  • ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలపై చర్చ
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పునర్ వైభవం దిశగా అడుగులు పడతాయన్న షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెప్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిశారు. ఈ భేటీ సోనియా నివాసంలో జరిగింది. ఈ సమావేశంపై షర్మిల ట్వీట్ చేశారు.

"సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని వారి నివాసంలో కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా... భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులు, ఇతర అంశాలపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం సంపాదించుకోవడమే కాదు ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ దిశగా మరిన్ని అడుగులు పడనున్నాయన్న విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను" అని షర్మిల వివరించారు. గాంధీల కుటుంబంతో తన భేటీకి సంబంధించిన ఫొటోను కూడా షర్మిల పంచుకున్నారు.

YS Sharmila
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
New Delhi
Congress
Andhra Pradesh
  • Loading...

More Telugu News