Vijay Sethupathi: 'పుష్ప' చాన్స్ తిరస్కరించారా? అన్న ప్రశ్నకు విజయ్ సేతుపతి ఆసక్తికర జవాబు

Vijay Setupathi interesting answer to whether he was rejected Pushpa chance

  • తెలుగు రాష్ట్రాల్లో మహారాజ సినిమా ప్రమోషన్స్
  • హాజరైన విజయ్ సేతుపతి
  • తాను పుష్ప రోల్ ను రిజెక్ట్ చేయలేదని వెల్లడి
  • కానీ అన్ని చోట్ల, అన్ని వేళలా నిజాలు మాట్లాడలేమని వ్యాఖ్యలు 

దక్షిణాదిన ఉన్న ప్రతిభావంతులైన నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. హీరో పాత్రల నుంచి విలన్ రోల్స్ వరకు అన్నింటా తనదైన ముద్ర వేస్తూ స్టార్ డమ్ అందుకున్నారు. పాత్ర ఏదైనా న్యాయం చేస్తాడన్న పేరుంది. తాజాగా తెలుగు నాట 'మహారాజ' సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు విచ్చేసిన విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప' చిత్రంలో మీరు రోల్ తిరస్కరించారట కదా? అని ఓ మీడియా ప్రతినిధి విజయ్ సేతుపతిని ప్రశ్నించారు. 

అందుకు విజయ్ సేతుపతి బదులిస్తూ... "నేను రిజెక్ట్ చేయలేదు సర్" అని చెప్పారు. 

కాసేపు ఆగి... "అన్ని చోట్ల, అన్ని సమయాల్లో నిజాలు మాట్లాడలేం సర్... లైఫ్ దెబ్బతింటుంది... అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చెబుతుండాలి సర్" అని చమత్కరించారు.

More Telugu News