Komatireddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల సెగ

Victims Protest To Change Alignment Of Nalgonda Ring Road
  • నల్లగొండ రింగ్‌ రోడ్డు అలైన్‌ మెంట్‌ మార్చాలని బాధితుల నిరసన
  • కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదని ఆవేదన
  • సీఎం రేవంత్‌ వచ్చినా చేసేదేమీ లేదని జారుకున్న మంత్రి కోమటిరెడ్డి
రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులు నల్లగొండలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఘెరావ్‌ చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలనిచ్చేది లేదని రోడ్డుపై బైఠాయించారు. కొందరు మహిళలు కాళ్లు పట్టుకుని ప్రాథేయపడినా ఫలితం లేకపోయింది. తాను చేసేదేమీ లేదని, సీఎం రేవంత్‌ వచ్చినా ఇదే పరిస్థితి అంటూ మంత్రి పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

తమకు న్యాయం చేస్తారని గెలిపిస్తే కష్టపడి కొనుక్కున్న తమ భూములు గుంజుకుంటున్నారని నిర్వాసితులు వాపోయారు. తమకు అన్యాయం జరిగితే కోమటిరెడ్డి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామ‌న్నారు. కాగా, నల్లగొండ పట్టణం మీదుగా కేంద్ర ప్రభుత్వం 565 నంబర్‌ జాతీయ రహదారిని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.
Komatireddy Venkat Reddy
Nalgonda Ring Road
Nalgonda District
Telangana

More Telugu News