Devineni Uma: కోడెలను వేధించిన కర్మఫలం జగన్‌ని వెంటాడుతోంది: దేవినేని ఉమ విమర్శలు

Uma Devineni criticizes YS Jagan that Karma haunting him

  • కోట్ల రూపాయల ఫర్నిచర్‌ను ఇంట్లో పెట్టుకున్నారని విమర్శించిన టీడీపీ సీనియర్ నేత
  • ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా? అని ప్రశ్నించిన మాజీ మంత్రి
  • జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలన్న దేవినేని ఉమ

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శల దాడి చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌ని వేధించిన కర్మఫలం జగన్ రెడ్డిని వెంటాడుతోందని వ్యాఖ్యానించారు.

కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణమని, ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? అని జగన్‌ని ఆయన ప్రశ్నించారు. ‘‘దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం.. రేటు కడతాం.. అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఒప్పు అవుతుందా? ఫర్నిచర్‌కు కక్కుర్తి పడ్డ వాళ్లు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో అర్థమవుతుంది’’ అని ఉమ విమర్శించారు. నవ్వుతారని కూడా లేకుండా జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా? నాటి మంత్రివర్గ సభ్యులు చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. తనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

Devineni Uma
YS Jagan
Telugudesam
Andhra Pradesh
AP Politics

More Telugu News