Rishikonda Palace: రుషికొండపై జగన్ రెడ్డి జల్సా ప్యాలెస్ లో రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే: టీడీపీ

TDP shares photos of luxurious bathroom in Rishikonda palace

  • నేడు రుషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు
  • ఇప్పటివరకు ఎవరూ చూడని లోపలి దృశ్యాలు బహిర్గతం
  • ఖరీదైన బాత్రూం ఫొటోలను షేర్ చేసిన టీడీపీ

విశాఖలోని రుషికొండపై కట్టిన ప్యాలెస్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ లోకానికి చూపించిన సంగతి తెలిసిందే. ఆయన రుషికొండ భవనంలోని ప్రతి గదినీ పరిశీలించి, దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలను తెలుగుదేశం పార్టీ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. 

ముఖ్యంగా, ఒక పెద్ద ఇంటిని తలపించేలా ఉన్న బాత్రూం ఫొటోలను టీడీపీ షేర్ చేసింది. "రుషికొండ మీద రూ.500 కోట్లతో  జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయటపడతాయో!" అంటూ టీడీపీ పేర్కొంది.

More Telugu News