Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrest MLA Raja Singh in Shamshabad airport

  • మెదక్ లో జంతు వధ నేపథ్యంలో అల్లర్లు
  • మెదక్ వెళతానని ప్రకటించిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
  • ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన రాజా సింగ్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

మెదక్ లో జంతు వధకు సంబంధించి అల్లర్లు జరగడం తెలిసిందే. దుకాణాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురికాగా, నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. 

ఈ నేపథ్యంలో, మెదక్ వెళ్లేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తాను మెదక్ వెళతానని రాజా సింగ్ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ఆయన ముంబయి నుంచి వస్తున్నారని తెలుసుకుని, శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అటు, మెదక్ లో బీజేపీ శ్రేణులు బంద్ కు పిలుపునిచ్చాయి. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Raja Singh
Arrest
Medak Riots
BJP
Telangana
  • Loading...

More Telugu News