CLAP: ఏపీ ప్రజలకు చెత్త పన్ను నుంచి ఊరట.. రద్దుపై త్వరలోనే నిర్ణయం

AP Govt Decided To Cancel Garbage Tax

  • ’క్లాప్‘ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైసీపీ ప్రభుత్వం
  • మురికివాడల ప్రజల నుంచి నెలకు రూ. 60
  • మిగతా ప్రాంతాల్లో రూ. 120 చొప్పున వసూలు
  • రద్దు చేయనున్నట్టు ప్రకటించిన మంత్రి నారాయణ

ఇప్పటి వరకు చెత్తపన్ను భారం మోసిన ఏపీ ప్రజలకు ఇప్పుడు ఉపశమనం లభించనుంది. ఈ పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పన్ను రద్దుపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ నిన్న తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌శాఖలో కీలకంగా పనిచేసిన ఓ మహిళా అధికారి ఆలోచనతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో చెత్త సేకరణ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన టెండర్‌ను ఓ కాంట్రాక్టర్ సంపాదించుకున్నాడు. ఈ విషయంలోనూ ఆ మహిళా అధికారి కీలకంగా వ్యవహరించారు.

చెత్త పన్నులో భాగంగా మురికివాడల్లో ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ. 60, మిగతా ప్రాంతాల్లో రూ. 120 వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు దానిని రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేస్తే ‘క్లాప్’ పథకం కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.

CLAP
Clean Andhra Pradesh
Tax On Garbage
  • Loading...

More Telugu News