Fake Paneer: మార్కెట్లో ఫేక్​ పనీర్​.. గుర్తించొచ్చు ఇలా!

How to Identify Fake Paneer

  • మార్కెట్‌లో నకిలీ పనీర్
  • తింటే ఆరోగ్యం మటాష్
  • నకిలీని గుర్తించేందుకు బోల్డన్ని మార్గాలు

మార్కెట్లో ఇప్పుడు అన్నీ నకిలీ వస్తువులే. ఉప్పు నుంచి పప్పు వరకు అంతా నకిలీ మయం. అసలేదో, నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఉంటాయి. కొనుగోలు సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నకిలీని ఇంటికి తెచ్చుకుని ఆపై తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో నకిలీ పనీర్ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. 

చూడ్డానికి అచ్చం పన్నీరులానే ఉన్నా.. ఇది తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఇందులో డిటర్జెంట్, యూరియా వంటివి వాడతారు. ఇవి శరీరంలోకి వెళ్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నకిలీ పనీర్‌ను గుర్తించేందుకు బోల్డన్ని మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా అది అసలుదో, నకిలీదో తెలుసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఈ వీడియోలో చూసేసి తెలుసుకుందామా!

Fake Paneer
Market
Health

More Telugu News