Suman: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: నటుడు సుమన్

Suman says AP development will possible with Chandrababu
  • ఏపీ రాజకీయ పరిణామాలపై స్పందించిన సుమన్
  • ఏపీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని వెల్లడి
  • కూటమి విజయం శుభపరిణామం అని వ్యాఖ్యలు
  • అమరావతి కాస్మోపాలిటిన్ సిటీ అవుతుందని ఆశాభావం 
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఏపీ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఏపీలో మూడు పార్టీల కూటమి విజయం సాధించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు సరైన తీర్పునిచ్చారని, మంచి కాంబినేషన్లో వచ్చిన కూటమికి విజయం కట్టబెట్టారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఐదేళ్లలో జరిగే అభివృద్ధికి ప్రజలు తమ ఓటుతో పునాది వేశారని సుమన్ తెలిపారు. 

వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, నాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే కారణమని సుమన్ వ్యాఖ్యానించారు. ఏపీలో విదేశీ నగరాల తరహాలో భారీ రాజధాని వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. అమరావతి కచ్చితంగా కాస్మోపాలిటన్ సిటీ అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

బీసీలకు ఏపీ నూతన ప్రభుత్వంలో పెద్దపీట వేశారని కొనియాడారు. ఏపీలో తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిలిం సిటీలు నిర్మించాలని సుమన్ సూచించారు. ఇక, ఏపీ నూతన ప్రభుత్వంలో బీసీలకు పెద్ద పీట వేశారని కొనియాడారు.
Suman
Chandrababu
Andhra Pradesh
TDP-JanaSena-BJP Alliance

More Telugu News