Peddireddi Ramachandra Reddy: పుంగనూరులో కూటమి పార్టీల భారీ ర్యాలీ... పర్యటన వాయిదా చేసుకున్న పెద్దిరెడ్డి

Pediireddy postpones Punganuru visit

  • నేడు పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటిస్తారంటూ స్థానిక వైసీపీ నేతల ప్రకటన
  • భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు
  • పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు
  • ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటన విరమించుకున్న పెద్దిరెడ్డి
  • ఎమ్మెల్యే అయినప్పటికీ సొంత నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితులు!

కొన్ని రోజుల వ్యవధిలోనే పరిస్థితులు మారిపోయాయి. నిన్నమొన్నటి వరకు పుంగనూరు నియోజకవర్గాన్ని శాసించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంత నియోజకవర్గంలోనే తిరుగులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 

పెద్దిరెడ్డి ఇవాళ పుంగనూరులో పర్యటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆయన తన పర్యటన విరమించుకున్నారు. నేడు పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటించనున్నారని స్థానిక వైసీపీ నేతలు ప్రకటించారు. 

అయితే, పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీలో టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

పుంగనూరులో అంబేద్కర్ సెంటర్ నుంచి ఇందిర కూడలి వరకు కూటమి నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెద్దిరెడ్డి వెనక్కి తగ్గారు. తన పర్యటన వాయిదా వేసుకున్నారు.

Peddireddi Ramachandra Reddy
Punganuru
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Chittoor District
  • Loading...

More Telugu News