Chandrababu: అధికారుల బదిలీలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు

CM Chandrababu exercises on officials transfers
  • ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
  • ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళనపై దృష్టి
  • కళంకిత అధికారులను దూరం పెట్టే యోచనలో సీఎం
  • సమర్థత, చిత్తశుద్ధి ఉన్న అధికారులకే కీలక పోస్టింగులు
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. మంత్రులకు శాఖలు కేటాయించిన నేపథ్యంలో, ఆయా శాఖల్లోని అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. సమర్థత, నిబంధనల పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారులకే కీలక పోస్టింగులు ఇవ్వాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగి చెడ్డపేరు తెచ్చుకున్న వారిని దూరం పెట్టనున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబును అనేకమంది అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కొందరు వివాదాస్పద అధికారులు చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. 

పలువురు అధికారులకు అనుమతి లభించలేదని, ఎలాగోలా ఒకరిద్దరు అధికారులు చంద్రబాబును కలిసినప్పటికీ వారి నుంచి బొకేలు తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారని సమాచారం. దీనికి సంబంధించి వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
Chandrababu
Officials
Transfers
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News