Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' నుంచి 'గరమ్ గరమ్' లిరికల్ వీడియో విడుదల

Garam Garam lyrical video from Saripodhaa Sanivaaram movie

  • నాని, ప్రియాంక మోహన్ జంటగా సరిపోదా శనివారం చిత్రం
  • వివేక్ ఆత్రేయ దర్శకత్వం
  • తాజాగా హీరో ఎలివేషన్ సాంగ్ విడుదల
  • జేక్స్ బిజోయ్ సంగీతం... భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం
  • ఆగస్టు 29న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న 'సరిపోదా శనివారం'

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్ జే సూర్య, సాయికుమార్ తదితరులు నటిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా 'గరమ్ గరమ్' అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ అయింది. 

సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ బాణీలకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. ఈ హీరో ఎలివేషన్ సాంగ్ ను విశాల్ దడ్లానీ ఆలపించారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై విలక్షణమైన కథతో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

More Telugu News