Spandana: వ్యవస్థల ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. మారిన ‘స్పందన’ పేరు

AP Govt refurbished Spandana Program

  • గత ప్రభుత్వం ‘స్పందన’ పేరుతో ప్రజల నుంచి వినతుల స్వీకరణ
  • దానిని ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ సిస్టంగా మార్పు
  • అదే పేరుతో వినతులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశం

గత ప్రభుత్వంలోని వ్యవస్థల ప్రక్షాళన చేపట్టిన ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ‘స్పందన’ పేరు మార్చాలని నిర్ణయించింది. దీనిని ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ సిస్టం పేరుతో పిలవాలని, ప్రజల నుంచి అదే పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించింది.

ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్పందన పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించేది.

Spandana
Andhra Pradesh
Grievance
  • Loading...

More Telugu News