Yediyurappa: మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టులో ఊరట

Court stays arrest of BS Yediyurappa

  • మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్‌పై స్టే విధించిన హైకోర్టు
  • తదుపరి విచారణ జరిగే వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు
  • ఈ నెల 17న సీఐడీ ఎదుట హాజరుకానున్న బీజేపీ నేత

లైంగిక వేధింపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్పకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 17న ఉంది. 17 ఏళ్ల బాలికను వేధించారనే ఆరోపణలపై నమోదైన ఫోక్సో కేసులో బెంగళూరు కోర్టు... యడియూరప్పపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్‌కు చెందిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం చేపడుతున్న విచారణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 17న సీఐడీ ముందు ఆయన హాజరుకానున్నారని... కాబట్టి అరెస్ట్‌ను నిలిపివేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కోర్టు అంగీకరించింది.

Yediyurappa
BJP
Karnataka
  • Loading...

More Telugu News