Sandeep Saroj: హీరో నితిన్ చేతుల మీదుగా ‘కమిటీ కుర్రోళ్లు' టీజర్ రిలీజ్! 

Commity Kurrollu Movie Update

  • యూత్ ను అలరించే కథతో 'కమిటీ కుర్రోళ్లు'
  • దర్శకుడిగా యదు వంశీ పరిచయం 
  • ఆకట్టుకుంటున్న టీజర్
  • చివరిదశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ 


పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్లనైనా, యువత అయినా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బావుందని అనుకుంటాం. అలా అనుకోవటం కూడా నిజమే! ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది... ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. 

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు.  ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం విశేషం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.  త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. 

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం రోజున ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్‌ విడుదలైంది. ప్రముఖ హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, సాయి కుమార్ ,గోపరాజు రమణ, బలగం జయరాం,శ్రీ లక్ష్మి  తదితరులు నటించారు. 

Sandeep Saroj
Yashwanth
Eshwar
Sai Kumar

More Telugu News