Roja: రూ.100 కోట్ల అక్రమాలు.. మాజీ మంత్రి రోజాపై ఫిర్యాదు

Complaint against former minister Roja

  • ‘ఆడుదాం ఆంధ్ర’, ‘సీఎం కప్‌’ల పేరిట ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆత్యా-పాత్యా సంఘం సీఈఓ
  • మాజీ మంత్రి రోజా, శామ్ మాజీ చైర్మన్ రూ.100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణ
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సీఐడీకి ఫిర్యాదు చేశామని వెల్లడి

ఏపీ క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ సిద్ధార్థ రెడ్డి.. ‘ఆడుదాం ఆంధ్ర’, ‘సీఎం కప్‌’ల పేరుతో చేసిన రూ. 100 కోట్ల అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేశామన్నారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ) కి ఫిర్యాదు చేశామని ఆర్డీ ప్రసాద్ తెలిపారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. నాటి కార్యకలాపాలకు చెందిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలన్నారు. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్. బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.

Roja
Andhra Pradesh
CID
SAP
  • Loading...

More Telugu News