Tamilisai Soundararajan: ‘అమిత్ షా వార్నింగ్’ ఘటనపై క్లారిటీ ఇచ్చిన తమిళిసై

BJP leader clears row over Amit Shah stern talk video

  • అమిత్ షా వీడియోను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్న తమిళిసై
  • భవిష్యత్తు కార్యాచరణపై షా తనకు కీలక సూచనలు మాత్రమే చేశారని వివరణ
  • తనను ఎవరూ మందలించలేదని స్పష్టీకరణ
  • ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన మాజీ గవర్నర్

చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ గవర్నర్ తమిళిసై ఖండించారు. అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన తనకు భవిష్యత్ కార్యాచరణపై సూచనలు మాత్రమే చేశారని వివరణ ఇచ్చారు. 

‘‘2024 ఎన్నికల తరువాత నేను తొలిసారిగా హోం మంత్రి అమిత్ షా ను కలిశాను. ఈ సందర్భంగా ఆయన నన్ను పిలిచి ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగారు. నేను మరింత విపులంగా చెప్పేందుకు ప్రయత్నించాను. అయితే, ఆయన సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పనిచేయాలని మాత్రమే చెప్పారు. ఈ ఘటన చుట్టూ నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ వివరణ’’ అని ఆమె ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. 

కాగా, తమిళిసై, హోం మంత్రి సంభాషణల వీడియో తమిళనాట ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు ముఖ్య నాయకురాలిని ఇలా బహిరంగంగా మందలించడం సరికాదని అధికార డీఎమ్‌కే పేర్కొంది. దీనిపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. అమిత్ షా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారని, ఇప్పుడు కేంద్రమంత్రి అని... కానీ మహిళా నాయకురాలి పట్ల బహిరంగంగా అలా ప్రవర్తించడం సరికాదన్నారు. అమిత్ షా తీరును తమిళనాడు సహా దేశమంతా చూసిందన్నారు.

  • Loading...

More Telugu News