Bangladesh: టీ20 వరల్డ్ కప్: నెదర్లాండ్స్ పై ఓ మోస్తరు స్కోరు చేసిన బంగ్లాదేశ్

Bangladesh registers 159 runs for 5 wickets against Nederlands

  • టీ20 వరల్డ్ కప్ ఇవాళ బంగ్లాదేశ్ × నెదర్లాండ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
  • నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసిన బంగ్లాదేశ్
  • 64 పరుగులతో నాటౌట్ గా నిలిచిన షకీబ్ అల్ హసన్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్-డి లో ఇవాళ బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. కింగ్ స్టన్ లోని అర్నోస్ వేల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. 

సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 46 బంతులు ఎదుర్కొన్న షకీబ్ 9 బౌండరీలు బాదాడు. ఓపెనర్ టాంజిద్ హసన్ 35, మహ్మదుల్లా 25 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 2, పాల్ వాన్ మీకెరెన్ 2, టిమ్ ప్రింగిల్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News