Narendra Modi: ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

PM Modi departs for Italy

  • మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ
  • ఇటలీలో రేపు జీ7 దేశాల అవుట్ రీచ్ సదస్సు
  • హాజరుకానున్న ప్రధాని మోదీ

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రం ఇటలీ పర్యటనకు బయల్దేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు. 

ఇటలీలోని ఏప్యూలియాలో జరిగే జీ7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సు రేపు (జూన్ 14) జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా, ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. 

ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం, తదితర రంగాలకు చెందిన అంశాలపై మోదీ, మెలోనీ చర్చించనున్నారు.

Narendra Modi
Italy
G7 Summit
India

More Telugu News