Teenmaar Mallanna: వార్డు మెంబర్‌గా కూడా పని చేయని నన్ను ఎమ్మెల్సీని చేశారు: తీన్మార్ మల్లన్న భావోద్వేగం

Teenmaar Mallanna gets emotional after oath taking

  • ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న
  • తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన మల్లన్న
  • ఇక బాధ్యత కలిగిన మల్లన్నను చూస్తారని వ్యాఖ్య

కనీసం వార్డు మెంబర్‌గా కూడా పని చేయని తనను పెద్దల సభకు పంపించారని తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన గెలుపుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో తనకు వచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు... ఈరోజు నుంచి బాధ్యత కలిగిన మల్లన్నలా ఉంటానన్నారు.

Teenmaar Mallanna
Congress
Graduate MLC Elections
  • Loading...

More Telugu News