Chandrababu: సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబు... దారిపొడవునా అఖండ స్వాగతం

Chandrababu off to secretariat

  • ఈ సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు
  • అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు
  • చంద్రబాబుపై పూల వర్షం కురిపించిన రైతులు, మహిళలు
  • దారిపై గులాబీ పూలు పరిచి అభిమానం చాటుకున్న వైనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించేందుకు సచివాలయానికి బయల్దేరారు. చంద్రబాబు కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చింది మొదలుకుని, సచివాలయం చేరే వరకు అఖండ స్వాగతం లభించింది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న రైతులు, మహిళలు ఆయనపై పూల వర్షం కురిపించారు. వాహనంపై నుంచి చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

రైతులు చంద్రబాబు వెళ్లే దారి మొత్తం గులాబీ పూలు పరిచి తమ అభిమానం చాటుకున్నారు. గజమాలతోనూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు ఈ సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న చాంబర్లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Chandrababu
Chief Minister
AP Secretariat
TDP
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News