Chandrababu: కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు

CM Chandrababu visits Kanakadurga temple in Vijayawada
  • ఈ ఉదయం తిరుమలలో చంద్రబాబు పర్యటన
  • ఈ మధ్యాహ్నం విజయవాడ రాక
  • ఇంద్రకీలాద్రిపై సీఎంకు స్వాగతం పలికిన అధికారులు
  • సంప్రదాయ నృత్యంతో అలరించిన విద్యార్థినులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన అనంతరం విజయవాడ చేరుకున్నారు. కనకదుర్గమ్మ దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో, తదితర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. 

కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో, విద్యార్థినులు ఇంద్రకీలాద్రిపై సంప్రదాయ నృత్యంతో అలరించారు. అమ్మవారి దర్శనం అనంతరం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
Chandrababu
Kanakadurga Temple
Vijayawada
TDP
Andhra Pradesh

More Telugu News