G. Kishan Reddy: కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, బండి సంజయ్

Kishan Reddy and Kishan Reddy take charges as Union Ministers

  • కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు
  • కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
  • కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్న కిషన్ రెడ్డి

  కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు గురువారం కేంద్రమంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా.. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఇతర దేశాల నుంచి మనం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.

మున్ముందు దిగుమతిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని పెంచుతామన్నారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు. బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల అధికారులతో ఒక బృందంగా నిబద్ధతతో పని చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందన్నారు. తమ ఓటింగ్ శాతం అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్ సభ ఎన్నికల నాటికి 14 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేశారని తెలిపారు.

  • Loading...

More Telugu News