Chandrababu: ఓఎస్డీలు, పీఏల విషయంలో జాగ్రత్తగా ఉండాలి: కొత్త మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu held meeting with new ministers

  • నేడు కొలువుదీరిన ఏపీ మంత్రివర్గం
  • ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులతో చంద్రబాబు భేటీ
  • పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం
  • వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని స్పష్టీకరణ

సీఎం చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. 

పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడాలు వివరించారు. 

ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని సూచించారు. 

రాష్ట్రంలో జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం అని పేర్కొన్నారు. 

ఇక, మంత్రుల ఇష్టాయిష్టాలు, వారి సమర్థత మేరకు రేపటి లోగా శాఖలు కేటాయిస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News