Chandrababu: తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు

CM Chandrababu and family members arrives Tirumala
  • నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు
  • ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనం
  • తిరుమలలో చంద్రబాబుకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
  • రేపు ఉదయం 8 గంటలకు శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం
ఇవాళ ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు... ఈ సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనమయ్యారు. కొద్దిసేపటి కిందట తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. 

చంద్రబాబు కుటుంబం ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనుంది. రేపు ఉదయం 8 గంటలకు చంద్రబాబు, కుటుంబ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లి తన చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.
Chandrababu
Tirumala
Chief Minister
TDP
Andhra Pradesh

More Telugu News