T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్: అమెరికాతో మ్యాచ్... గెలిస్తే టీమిండియాకు సూపర్-8 బెర్తు

Team India eyes on win over USA

  • నేడు టీమిండియా × అమెరికా
  • న్యూయార్క్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా నేడు ఆతిథ్య అమెరికా జట్టుతో ఆడనుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సూపర్-8 దశలో ప్రవేశిస్తుంది.

ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచిన టీమిండియా 4 పాయింట్లతో గ్రూప్-ఏలో టాపర్ గా కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న అమెరికా జట్టు కూడా 2 మ్యాచ్ ల్లో 2 విజయాలు సాధించడం విశేషం. 

ఆ జట్టు తొలి మ్యాచ్ లో కెనడాపై గెలిచి, రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ ను కంగుతినిపించింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ వరకు వెళ్లిన పాక్ తో మ్యాచ్ లో చివరికి అమెరికాదే పైచేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో, అమెరికాను టీమిండియా ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితులు లేవు.

  • Loading...

More Telugu News