Sudher Babu: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలివే!

This releasing movies

  • ఈ నెల 14న వస్తున్న 'హరోం హర'
  • సుధీర్ బాబు జోడీకట్టిన మాళవిక శర్మ 
  • యేవమ్ .. మహారాజపై అంచనాలు 
  • లైన్లోనే ఉన్న మరో రెండు సినిమాలు


ఈ శుక్రవారం .. 14వ తేదీన థియేటర్లలో దిగిపోతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఐదు సినిమాలు ఈ బరిలోకి దిగుతున్నాయి. ఆ జాబితాలో కాస్త బజ్ ఎక్కువగా ఉన్న సినిమాగా 'హరోం హర' కనిపిస్తోంది. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించాడు. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఇక రెండో స్థానంలో 'యేవం' ఆసక్తిని రేపుతోంది. చాందినీ చౌదరి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ప్రకాశ్ దంతులూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా నవదీప్ ఉండటం విశేషం. అదే రోజున 'ఇంద్రాణి' .. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రధారిగా 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాలు థియేటర్లకు రానున్నాయి.ఈ నాలుగు సినిమాలతో పాటు ఒక తమిళ అనువాదం కూడా ఆ రోజునే విడుదలవుతోంది .. ఆ సినిమా పేరే 'మహారాజ'. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ .. అభిరామి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ ఐదు సినిమాలలో ఏది ఎక్కువగా ఆకట్టుకుంటుందనేది చూడాలి మరి.     

More Telugu News