Nara Rohith: పెదనాన్న... అంటూ నారా రోహిత్ రాసిన లేఖ వైరల్

Nara Rohith letter went viral

  • నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
  • చరిత్రలో మరెవరికీ సాధ్యంకాని ఘనవిజయం సాధించారన్న నారా రోహిత్
  • కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని కితాబు
  • ఈ విజయం ప్రతి ఒక్కరిదీ అని వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన సోదరుడి కుమారుడు, టాలీవుడ్ కథానాయకుడు నారా రోహిత్ స్పందించారు. పెదనాన్న అంటూ లేఖ రాసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఆల్ ది వెరీ బెస్ట్ పెదనాన్న" అంటూ విషెస్ తెలిపారు.

"పెదనాన్న... గత నాలుగున్నర దశాబ్దాలుగా మీరు రాజకీయాలలో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూశారు... తట్టుకున్నారు... ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ గత ఐదేళ్ల కాలంలో ఎంతో వేదన అనుభవించారు. అయినప్పటికీ పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు. అప్పుడు తెలిసింది... గత 40 ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం అని. 

చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అని సాహసం చేయలేని విధంగా ఈ ఎన్నికల్లో  విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం ఎన్డీయే కూటమిది మాత్రమే కాదు... ఆంధ్రా ప్రజలది, తెలుగువారిది, మనందరిదీ. 

నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ నారా రోహిత్ తన  లేఖలో పేర్కొన్నారు. 

Nara Rohith
Chandrababu
Chief Minister
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News