Bandi Sanjay: ప్రియమిత్రుడు అంటూ సత్యకుమార్‌కు బండి సంజయ్ శుభాకాంక్షలు

Bandi Sanjay congratulates Satya Kumar

  • ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత సత్యకుమార్
  • ప్రజాసేవలో దిగ్విజయంగా కొనసాగాలని బండి సంజయ్ ట్వీట్
  • ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రాష్ట్ర బీజేపీ నేత సత్యకుమార్‌కు కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఆప్తులు, ప్రియమిత్రుడు, పాలన వ్యవహారాలలో, ప్రజాసంబంధాలలో దూరదృష్టి కలిగిన సత్యకుమార్ ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. నూతన అధ్యాయమైన ప్రజాసేవలో వారు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాన'ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సత్యకుమార్ ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.  

Bandi Sanjay
BJP
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News