Muddada Ravichandra: ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియామకం

Appointment of Muddada Ravichandra as Chief Secretary to AP Chief Minister

  • చంద్రబాబు నాయుడుకి ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర 
  • ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు
  • వెంటనే బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రకు ప్రభుత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వెంటనే బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11.27 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.    


More Telugu News