Anand Mahindra: 'బుజ్జి'ని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇదిగో వీడియో!

Anand Mahindra Drives Bujji

  • నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో 'కల్కి 2898ఏడీ'
  • ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించిన మేకర్స్
  • దానికి 'బుజ్జి' అని పేరు పెట్టిన చిత్రం యూనిట్
  • తాజాగా ఈ వాహనాన్ని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా    

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో 'కల్కి 2898ఏడీ' ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇది రూపొందుతోంది. సాంకేతికంగా ఉన్నత విలువలతో దర్శకుడు అద్భుతంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించారు. దానికి 'బుజ్జి' అని పేరు పెట్టారు. 

ప్రస్తుతం ఈ వాహనం సినిమా ప్రమోషన్లలో సందడి చేస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుజ్జిని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్‌లను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కాగా, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చెందిన తన బృందం భవిష్యత్ లో రోబో వాహనాన్ని రూపొందించాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్‌కి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించడంలో సహాయపడిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. 

ఇదిలాఉంటే.. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నెల 27న 'కల్కి 2898ఏడీ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Anand Mahindra
Kalki 2898AD
Bujji
Tollywood
Prabhas
Nag Ashwin

More Telugu News