Bandi Sanjay: మోదీ కేబినెట్లో... బండి సంజయ్ సహా 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

28 Ministers In Modi  Cabinet Face Criminal Cases

  • 71 మంది కేంద్రమంత్రుల్లో 39 శాతం మందిపై కేసులు
  • 19 మందిపై హత్యాయత్నం, విద్వేష ప్రసంగం, మహిళలపై నేరాల కేసులు
  • సురేశ్ గోపి, బండి సంజయ్ సహా ఐదుగురిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు

నరేంద్రమోదీ కేబినెట్‌లోని 39 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్‌పై కూడా కేసులు ఉన్నాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. మొత్తం 71 మంది మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది.

ఆయా ఎంపీలు తమ ఎన్నికల నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. 28 మందిలో 19 మందిపై హత్యాయత్నం, విద్వేష ప్రసంగం, మహిళలపై నేరాలు వంటి తీవ్ర కేసులు ఉన్నట్లు తెలిపింది.

పోర్ట్స్, షిప్పింగ్‌, వాటర్‌ వేస్ శాఖల సహాయమంత్రి శంతను ఠాకూర్‌, విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుఖాంత మజుందార్‌పై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు పేర్కొంది. శంతను ఠాకూర్, మజుందార్, బండి సంజయ్, సురేష్‌ గోపీ సహా ఐదుగురు సహాయ మంత్రులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు నమోదైనట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News