Ustaad Bhagat Singh: ప్రమాణ స్వీకారం వేళ పవర్ స్టార్ అభిమానులకు డబుల్ ధమాకా!

Ustaad Bhagat Singh Movie New Poster Released

  • ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ ప్రమాణం
  • కంగ్రాట్స్ తెలుపుతూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి పోస్టర్‌ విడుదల 
  • పవర్ స్టార్, హరీశ్ శంకర్ కాంబోలో మూవీ


ఏపీలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటివెంట 'పవన్ కల్యాణ్ అనే నేను' మాట వినగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఈ మాట కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూసిన జనసేన సైనికులు, సినీ అభిమానుల కోరిక ఈరోజుతో నెరవేరింది. పవన్ కల్యాణ్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. 

ఇక పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ 'ఉస్తాద్ భగత్‌సింగ్' చిత్రం యూనిట్ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేసింది. పవర్ స్టార్, హరీశ్ శంకర్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్‌లో అదరగొట్టేశాడనే చెప్పాలి. పోలీస్ యూనిఫాం వేసుకొని చేతిలో సుత్తి పట్టుకుని ఉన్న పవన్ స్టిల్ సింప్లీ సూపర్‌గా ఉంది. 

ఇక ఈ పోస్టర్‌లో 'సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అనే క్యాప్షన్ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌ అవుతోంది. పోస్టర్‌ చూసిన పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పవర్ స్టార్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి.

More Telugu News