MP Salary: మన ఎంపీలు అందుకునే జీతభత్యాలు ఎంతంటే..!

Lok Sabha MPs Salary And allowance details

  • నెలకు రూ.లక్ష ప్లస్ అలవెన్సులు
  • నియోజకవర్గ ఖర్చుల కింద రూ.70 వేలు
  • ఆఫీస్ నిర్వహణ కోసం రూ.60 వేలు

దేశవ్యాప్తంగా ఇటీవల 543 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, లోక్ సభకు ఎన్నికైన ఎంపీకి ప్రభుత్వం నుంచి అందే జీతం ఇతరత్రా ప్రయోజనాలు ఏంటనే వివరాలు ఇవిగో..

  • జీతం రూ. లక్ష
  • నియోజకవర్గ ఖర్చులు రూ.70 వేలు నెలకు
  • ఆఫీస్ నిర్వహణకు రూ. 60 వేలు
  • పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే డీఏ కింద రోజుకు రూ. 2 వేలు
  • ఎంపీ తన భాగస్వామితో కలిసి ఏడాదికి 34 సార్లు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు
  • రైలులో ఫస్ట్ క్లాస్ ప్రయాణం (వ్యక్తిగత, అధికారిక పనులకు)
  • నియోజకవర్గంలో పర్యటించినపుడు టీఏ క్లెయిమ్ చేసుకోవచ్చు
  • పదవీకాలం పూర్తయ్యే వరకు ఉచిత వసతి సౌకర్యం.. లేదా వసతి కోసం నెలకు రూ 2 లక్షలు
  • ఎంపీ కుటుంబానికి ఉచిత వైద్య సదుపాయం
  • పదవీకాలం పూర్తయ్యాక నెలకు రూ.25 వేలు పింఛన్ (ఒక్కసారి కంటే ఎక్కువ పర్యాయాలు ఎంపీగా సేవలందిస్తే పింఛన్ ఏటా రూ.2 వేల చొప్పున పెంపు)
  • ఉచిత ఫోన్ కాల్ సదుపాయం (ఏటా 1.5 లక్షల ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు)
  • హైస్పీడ్ ఇంటర్నెట్, 50 వేల యూనిట్ల వరకు విద్యుత్ వాడుకోవచ్చు

  • Loading...

More Telugu News