Ram Charan: పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారోత్సవానికి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్

Ram Charan arrives Pawan Kalyan oath taking ceremony

  • ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్
  • నేడు ప్రమాణ స్వీకారం
  • ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్న మెగా ఫ్యామిలీ
  • రామ్ చరణ్ రాకతో కోలాహలం

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. రామ్ చరణ్ రాకతో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద కోలాహలం నెలకొంది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఉత్సాహం చూపించారు. రామ్ చరణ్ ఎవరినీ నిరాశ పర్చకుండా సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు.

Ram Charan
Pawan Kalyan
Deputy CM
Janasena
Andhra Pradesh

More Telugu News