Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకార వేడుక.. కిక్కిరిసిన జనం

Chandrababu Oath taking ceremony

  • కేసరపల్లికి బయలుదేరిన చంద్రబాబు
  • ఉదయం 9 గంటలకే కిక్కిరిసిన సభావేదిక
  • సభావేదికపై కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్
  • చిరాగ్ ను బాలకృష్ణకు పరిచయం చేసిన రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఉదయం 11:27 గంటలకు ప్రమాణస్వీకార ముహూర్తం కాగా.. ఉదయం నుంచే జనం తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే సభావేదిక కిక్కిరిసిపోయింది. చాలామంది సీట్లు లేక నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే సభావేదికపైకి వచ్చారు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా సభా వేదికపై కనిపిస్తున్నారు.

టీడీపీ సీనియర్ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా వేదికపైకి చేరుకున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఇక, చంద్రబాబు ఇప్పటికే బయలుదేరారని, కాసేపట్లో కేసరపల్లి చేరుకుంటారని సభ నిర్వాహకులు ప్రకటించారు. అతిథులను అలరించేందుకు సభావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సీనియర్ నేతలు నేడు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.

Chandrababu
Oath
kesarapally
Balakrishna
chirag pasawan
Rammohan naidu

More Telugu News