Amit Shah: చంద్రబాబు ఇంటికి అమిత్ షా, జేపీ నడ్డా... మంత్రివర్గ కూర్పుపై చర్చ

Amit Shah reaches Chandrababu home

  • బీజేపీ నుంచి ఎవరికి పదవులు ఇవ్వాలనే అంశంపై చర్చ
  • నేటి అర్ధరాత్రి తర్వాత గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపించే అవకాశం
  • మంత్రులుగా అవకాశం దక్కిన వారికి ఫోన్ చేయనున్న చంద్రబాబు

కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. వారికి టీడీపీ అధినేత స్వాగతం పలికారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ఆయన నివాసానికి వచ్చారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్ కూడా టీడీపీ అధినేత నివాసానికి వచ్చారు. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరెవరికి పదవులు ఇవ్వాలి? ఏ పదవి ఇవ్వాలి? అనే అంశంపై చర్చించారు. బీజేపీ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీరి భేటీ దాదాపు 45 నిమిషాలు కొనసాగింది.

అమిత్ షాతో భేటీ తర్వాత... టీడీపీ, జనసేనల నుంచి కేబినెట్లోకి తీసుకునే వారి జాబితాను సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి తర్వాత గవర్నర్‌కు మంత్రుల జాబితాను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబు ఫోన్ చేసి సమాచారం అందించనున్నారు. ఇప్పటికే పలువురు ఆశావహులు విజయవాడ, గుంటూరులలో మకాం వేశారు. చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్ కోసం వేచి చూస్తున్నారు. 


  .

Amit Shah
Chandrababu
JP Nadda
BJP
Congress

More Telugu News