Amit Shah: గన్నవరం చేరుకున్న అమిత్ షా... ఘనస్వాగతం పలికిన నారా లోకేశ్

Amit Shah reaches Gannavaram Air Port

  • అమిత్ షా వెంట వచ్చిన బండి సంజయ్, జేపీ నడ్డా
  • విమానాశ్రయంలో స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ నేతలు
  • గన్నవరం చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు. అమిత్ షా వెంట కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వచ్చారు. అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

పురందేశ్వరి, సీఎం రమేశ్, సుజనా చౌదరి, సత్యకుమార్, టీజీ వెంకటేశ్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కాసేపట్లో అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. అనంతరం నోవాటెల్ హోటల్లో బస చేస్తారు.  టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గన్నవరం చేరుకున్నారు.
  
   చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సింగపూర్, కొరియా కాన్సులేట్ జనరల్స్, ఇతర ప్రతినిధులు హాజరవుతున్నారు. జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ కాన్సులేట్ జనరల్స్‌కు కూడా ఆహ్వానం పంపించారు.

ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన చిరంజీవి సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి కుటుంబ సభ్యులతో వచ్చిన చిరంజీవికి, కుటుంబ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గన్నవరం చేరుకున్నారు.

Amit Shah
Bandi Sanjay
Nara Lokesh
  • Loading...

More Telugu News