Sudheer Babu: మహేశ్ బాబు నా ఫంక్షన్స్ కి రాకపోవడానికి కారణం అదే: సుధీర్ బాబు

Harom Hara Movie Update

  • సుధీర్ బాబు హీరోగా 'హరోం హర'
  • ఈ నెల 14న విడుదలవుతున్న సినిమా 
  • ఆ దశలో తనకి మహేశ్ సాయం అవసరమని వ్యాఖ్య 
  • మహేశ్ సూచనలు ఎప్పటికీ ఉంటాయని వెల్లడి


మొదటి నుంచి సుధీర్ బాబు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. పాత్రకి తగినట్టుగా తెరపై కనిపించడానికి గట్టి కసరత్తులు చేస్తూ ఉంటాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను మాత్రమే ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలాంటి సుధీర్ బాబు నుంచి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హరోం హర' సినిమా రెడీ అవుతోంది. 

సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించాడు. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు అనేక విషయాలను ప్రస్తావించాడు. 

 ఇంతవరకూ నేను 20 సినిమాలు చేశాను. వాటిలో ఐదారు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో మాత్రమే మహేశ్ బాబును ఆహ్వానించడం జరిగింది. ఆ తరువాత మహేశ్ బాబు ఎందుకు రావడం లేదా అని అంతా అనుకుంటున్నారు. ఒక స్థాయికి వచ్చేవరకు మాత్రమే నేను మహేశ్ సాయం తీసుకున్నాను. ఆ తరువాత కూడా ఆయన పేరును వాడుకుంటూ ఎదగాలని నేను అనుకోలేదు. ఇక ఒక కో స్టార్ గా .. బంధువుగా కూడా మహేశ్ చేసే సూచనలు కూడా సింపుల్ గానే ఉంటాయి" అని అన్నాడు. 

Sudheer Babu
Malavika Sharma
Harom Hara
  • Loading...

More Telugu News