Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు

Chargesheet files in Phone Tapping case

  • మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
  • కేసులో నలుగురు అధికారుల అరెస్ట్
  • బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భుజంగరావు, తిరుపతన్న
  • బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి
  • రేపు తీర్పు వెల్లడించనున్న నాంపల్లి కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. సిట్ దర్యాఫ్తు బృందం కస్టడీలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

మరోవైపు, భుజంగరావు, తిరుపతన్నలు తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని నిందితులు కోర్టుకు తెలిపారు. అయితే వారిని ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Phone Tapping Case
Telangana
  • Loading...

More Telugu News