Kalki 2898 AD: 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ విడుదల... తెలుగు సినిమానా, హాలీవుడ్ సినిమానా...?

Prabhas starring Kalki 2898 AD trailer out now

  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ
  • కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్
  • ప్రభాస్ సరసన దీపిక పదుకొణే, దిశా పటానీ
  • జూన్ 27న గ్రాండ్ రిలీజ్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సై-ఫై యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రం నుంచి నేడు ఎనర్జటిక్ ట్రైలర్ రిలీజైంది. తెలుగు వెండితెరపై ఇప్పటివరకు చూడని మరో ప్రపంచం ఆవిష్కరించారనడంలో సందేహం లేదు. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటే ఇదే అనిపించేలా ఉంది. 

కొన్ని వందల ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో, టెక్నాలజీ ఎంత ముందడుగు వేస్తుందో చూపించే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ చెబుతోంది. హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఓ తెలుగు సినిమాను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఎక్కడా బడ్జెట్ పరంగా వెనుకడుగు వేయకుండా కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ మేరకు ట్రైలర్ లో అంతర్జాతీయ స్థాయి నాణ్యత కనిపిస్తోంది. 

ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపిక పదుకొణే, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.

Kalki 2898 AD
Trailer
Prabhas
Nag Ashwin
Deepika Padukone
Disha Patani
Amitabh Bachchan
Kamal Haasan
Vyjayanthi Movies

More Telugu News