Suresh Gopi: ఆ సీనియర్లకు పాత శాఖలే.. సురేశ్ గోపికి టూరిజం సహాయమంత్రిత్వ శాఖ

Suresh Gopi became the MoS of Tourism and Culture

  • గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలకు పాత శాఖలే కేటాయింపు
  • కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ
  • చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడాశాఖ కేటాయింపు

కేరళలోని త్రిస్సూర్ ఎంపీ సురేశ్ గోపికి శాఖను కేటాయించారు. ఆయనకు టూరిజం సహాయమంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నిన్న సాయంత్రం మోదీ సహా 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. వారికి శాఖలను కేటాయించారు. పీయూష్ గోయల్‌కు వాణిజ్యం, నితిన్ గడ్కరీకి రవాణాశాఖ, అమిత్ షాకు కేంద్ర హోంశాఖ, రాజ్ నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, జైశంకర్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమలు అప్పగించారు.

ధర్మేంద్ర ప్రదాన్‌కు మానవవనరుల శాఖ; జేపీ నడ్డాకు వైద్యం; భూపేంద్ర యాదవ్‌కు పర్యావరణం; మన్సుక్ మాండవీయకు కార్మిక శాఖ, క్రీడలు; జితిన్ రామ్‌కు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు; సీఆర్ పాటిల్‌కు జలశక్తి; చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడలు; శరబానంద సోనోవాల్‌కు ఓడరేవులు, షిప్పింగ్; అన్నపూర్ణదేవికి మహిళా, శిశు సంక్షేమం; కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగించారు.

Suresh Gopi
BJP
Narendra Modi
  • Loading...

More Telugu News