Etela Rajender: అమిత్ షాను కలిసిన ఈటల రాజేందర్

Etala Rajendar meets Amit Shah

  • కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపిన ఈటల
  • ఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అంటూ కథనాల నేపథ్యంలో ప్రాధాన్యత
  • బండి సంజయ్‌కి ఈటల, రఘునందన్ రావు శుభాకాంక్షలు

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి లోక్ సభ సభ్యుడు ఈటల రాజేందర్ సోమవారం కేంద్రమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చునని కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన అమిత్ షాను కలిశారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం అమిత్ షాను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.

బండి సంజయ్‌కి ఈటల శుభాకాంక్షలు

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్‌కి పలువురు ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు అభినందనలు తెలిపారు.

Etela Rajender
Amit Shah
Union Cabinet
BJP
  • Loading...

More Telugu News