Talasani: తలసాని సోదరుడు కన్నుమూత

Talasani Srinivas Yadav Brother Dead

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు శంకర్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్ యాదవ్.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస వదిలారు. శంకర్ యాదవ్ మృతితో తలసాని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కాగా, శంకర్ యాదవ్ బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా పనిచేశారు. సిటీలోని పలు మార్కెట్లకూ అధ్యక్షుడిగా వ్యవహరించారు. శంకర్ యాదవ్ మరణించిన విషయం తెలిసి పలువురు బీఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంతాపం తెలిపారు.

Talasani
BRS Leader
Shankar yadav
Monda market
  • Loading...

More Telugu News