TGRTC: ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి.. వీడియో వైరల్!
- షాద్ నగర్‌లో ఘటన
- తాను వెళ్లాల్సిన బస్సు ఎంతకూ రాకపోవడంతో డ్రైవర్‌తో ప్రయాణికుడి వాకబు
- నన్నే అడుగుతావా అంటూ ప్రయాణికుడిపై దాడి చేసిన ఆర్‌టీసీ డ్రైవర్
ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. షాద్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు చాలా సేపటివరకు తాను వెళ్లాల్సిన బస్సు కోసం ఎదురుచూశాడు. కానీ, ఎంతకూ ఆ బస్సు రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ డ్రైవర్‌ను వాకబు చేశాడు. షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి రెండు గంటలుగా ఎదురుచూస్తున్నా బస్సులు రావడంలేదని ఆ ప్రయాణికుడు డ్రైవర్‌ను అడిగాడు. అంతే.. సదరు డ్రైవర్ విచక్షణరహితంగా ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు కలుగజేసుకొని వారించడంతో డ్రైవర్ ఆగాడు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.