Team India: పాకిస్థాన్ పేసర్ల విజృంభణ... టీమిండియా 119 ఆలౌట్

Team India bundled out for 119 runs against Pakistan

  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • 19 ఓవర్లలోనే కుప్పకూలిన టీమిండియా
  • 42 పరుగులు చేసిన పంత్
  • పోటాపోటీగా వికెట్లు తీసిన పాక్ పేసర్లు

టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఏ మ్యాచ్ లో పాకిస్థాన్ తో పోరులో టీమిండియా తడబాటుకు గురైంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ పేసర్లు పోటాపోటీగా వికెట్లు తీశారు. 

టీమిండియా ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. పంత్ అనేకమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అక్షర్ పటేల్ 20, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మన్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. కోహ్లీ 4, సూర్యకుమార్ యాదవ్ 7, శివమ్ దూబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0 పరుగులు చేశారు. 

పాక్ బౌలర్లలో నసీమ్ షా 3, హరీస్ రవూఫ్ 3, మహ్మద్ అమీర్ 2, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.

Team India
Pakistan
New York
T20 World Cup 2024
  • Loading...

More Telugu News