Bandi Sanjay: ఈ స్థాయికి వస్తానని నేను అస్సలు ఊహించలేదు: బండి సంజయ్

Bandi Sanjay about cabinet post

  • తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని హామీ
  • ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి అన్న సంజయ్
  • తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామన్న బీజేపీ నేత

తాను ఈ స్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ఆయనకు మోదీ క్యాబినెట్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Bandi Sanjay
BJP
Telangana
Narendra Modi
  • Loading...

More Telugu News