Nara Lokesh: రామోజీరావు ఇచ్చిన ఆ సూచన ఎప్పటికీ మరువను: నారా లోకేశ్

Nara Lokesh attends Ramoji Rao last rites in Hyderabad

  • హైదరాబాదులో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
  • అంతిమయాత్రలో పాల్గొన్న నారా లోకేశ్
  • యువతకు రామోజీ ఒక స్ఫూర్తి ప్రదాత అని కొనియాడిన లోకేశ్

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. ఫిలింసిటీలోని రామోజీరావు నివాసం నుంచి స్మారక ప్రదేశం వరకు జరిగిన అంతిమయాత్రలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. అక్షర యోధుడికి చివరి వీడ్కోలు పలికారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రామోజీరావు నాకు మార్గదర్శకులు అని తెలిపారు. రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావుది ఓ చరిత్ర అని కొనియాడారు.

"నా లాంటి యువతకు ఆయన స్ఫూర్తి ప్రదాత. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావుది. ఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధాన నిర్ణయాలు తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదు. ఏరంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురమ్మని రామోజీరావు నాకు నిత్యం ఇచ్చే సూచన ఎప్పటికీ మరువను. రామోజీరావు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం" అని వివరించారు.

Nara Lokesh
Ramoji Rao
Funeral
Hyderabad
Eenadu
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News