Ramoji Rao: అశ్రునయనాల మధ్య మొదలైన రామోజీ అంతిమయాత్ర

Ramoji Rao Last Rites

  • ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి స్మృతివనం వరకు కొనసాగుతున్న యాత్ర
  • కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ప్రముఖుల హాజరు
  • అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్న ప్రభుత్వం

రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమయాత్ర మొదలైంది. ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకూ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, రామోజీ సంస్థల ఉద్యోగులు ఆయన పార్థివదేహం వెంట నడుస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీస్ బ్యాండ్ తో పాటు సిబ్బంది ముందు నడవగా.. పూలరథంలో రామోజీ పార్థివదేహాన్ని ఉంచి స్మృతివనానికి తీసుకెళుతున్నారు.

Ramoji Rao
Ramoji Group
Enaadu
Ramoji Film city
Last Rites

More Telugu News