T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ సంచలనం

West Indies won by 134 runs against Uganda In T20 World Cup 2024

  • ఉగాండాపై ఏకంగా 134 పరుగుల తేడాతో గెలుపు
  • 174 పరుగుల లక్ష్య ఛేదనలో 39 పరుగులకే ఉగాండా ఆలౌట్
  • టీ20 వరల్డ్ కప్‌లలో అత్యల్ప స్కోరుగా నమోదు

టీ20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలనం నమోదైంది. స్వల్ప స్కోర్లు నమోదవుతున్న ప్రస్తుత టోర్నీలో మరో రికార్డు స్థాయి అత్యల్ప స్కోరు నమోదైంది. వెస్టిండీస్‌పై 174 పరుగుల లక్ష్య ఛేదనలో ఉగాండా కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 వరల్డ్ కప్‌లలో ఒక జట్టుకు ఇదే అత్యల్ప స్కోరుగా ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఏకంగా 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన రెండవ జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా స్పిన్నర్ హోసేన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి విండీస్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. మిగతా బౌలర్లలో జోసెఫ్ 2, షెఫర్డ్, ఆండ్య్రూ రస్సెల్, గుడకేశ్ మోటీ తలో వికెట్ తీశారు.

ఇక ఉగాండా బ్యాటర్లలో రోజర్ ముకాసా (0), సైమన్ స్సేసాజి (4), రాబిన్సన్ ఒబుయా(6), రియాజత్ అలీ షా(3), అల్పేష్ రంజానీ (5), దినేష్ నక్రానీ(0), జుమా మియాగి(13), కెన్నెత్ వైస్వా(1), బ్రియాన్ మసాబా (1), కాస్మాస్ క్యువుటా(1), ఫ్రాంక్ న్సుబుగా(0) చొప్పున పరుగులు చేశారు.

కాగా తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్(13), జాన్సన్ చార్లెస్ (44), నికోలస్ పూరన్ (22), రోవ్‌మాన్ పావెల్ (23), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(22), ఆండ్రీ రస్సెల్(30 నాటౌట్), రొమారియో షెపర్డ్(5 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఉగాండా బౌలర్లలో మసాబ 2, అల్పేస్ రంజానీ, క్వేవుటా, దినేశ నక్రానీ తలో వికెట్ తీశారు.

టీ20 వరల్డ్ కప్‌లో అత్యుల్ప స్కోర్లు...
1. శ్రీలంక చేతిలో నెదర్లాండ్ - 39 పరుగులు (2014)
2. వెస్టిండీస్ చేతిలో ఉగాండా  39 పరుగులు (2024)
3. శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ - 44 పరుగులు (2021)
4. ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ - 55 పరుగులు (2021)
5. ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఉగాండా - 58 పరుగులు (2024)

టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగుల విజయాలు
1. కెన్యాపై శ్రీలంక గెలుపు - 172 పరుగులు (2007)
2. ఉగాండాపై వెస్టిండీస్ గెలుపు - 134 పరుగులు (2024)
3. స్కాట్‌లాండ్‌పై ఆప్ఘనిస్థాన్ గెలుపు - 130 పరుగులు (2021)
4. స్కాట్‌లాండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపు - 130 పరుగులు (2009)
5. ఉగాండాపై ఆఫ్ఘనిస్థాన్ గెలుపు - 125 పరుగులు (2024).

  • Loading...

More Telugu News